WGL: చెన్నారావుపేట మండలంలోని విద్యా సంస్థల్లో కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO బైరి సరళ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేజీబీవీలో హెడ్ కుక్ 1 పోస్టు, మోడల్ స్కూల్ అమీనాబాద్‌లో అసిస్టెంట్ కుక్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ కుక్కు పదో తరగతి, అసిస్టెంట్ కుక్కు ఏడో తరగతి ఉత్తీర్ణత అర్హతగా ఉండాలని ఆమె తెలిపారు.