NLG: నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల NSS వాలంటీర్లు నర్సింగ్ భట్ల, చెన్నూగూడెం, పాతూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చెన్నూగూడెం గ్రామంలో ర్యాలీ చేపట్టి, పరిశుభ్రత ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే, అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించారు.