NLG: రైతు కష్టం దళారుల పాలవుతోంది. దిగుబడులకు మద్దతు ధర పొందడంలో రైతన్నలు దగాపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు దళారుల చేతులో దగాకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట చేతికి వచ్చింది. ఇప్పటికే పత్తి ఏరడం పూర్తయి రెండవ దశ కూడా ఏరుతున్నారు. ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ప్రారంభించాలని రైతులు వాపోయారు.