MLG: మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి మహిళ మహిళా సంఘాల్లో చేరాలని రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. రెండున్నర ఏళ్లలో 36 వేల కోట్ల రుణాలు, 11 వేల 21 కోట్ల వడ్డీ మాఫీ అందించామని మంత్రి పేర్కొన్నారు.