AP: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ జెడ్పీటీసీ నారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కొయ్యురు మండలం నర్సీపట్నంలో చోటుచేసుకుంది. భూ వివాదాలే హత్యకు కారణమని తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.