Panchayat Secretaries Strike:తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పంచాయతీ కార్యదర్శులు (Panchayat Secretaries) స్పష్టంచేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని.. లేదంటే ఉద్యోగం నుంచి తీసివేస్తామని నిన్న ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు (Panchayat Secretaries) వెనక్కి తగ్గడం లేదు. ఉద్యోగం నుంచి తొలగిస్తాం అని బెదిరించిన వినడం లేదు. ప్రభుత్వమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. విధించిన డెడ్ లైన్ విత్ డ్రా చేసుకోవాలని.. తమతో చర్చలు జరపాలని కోరుతున్నారు. ఇటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (Panchayat Secretaries) బీజేపీ (bjp) మద్దతు తెలిపింది. వారికి సపోర్ట్‌గా ఎల్లుండి ( ఈ నెల 11న) సంగారెడ్డిలో ఉద్యోగ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది.
తమను రెగ్యులర్ చేయాలని పంచాయతీ కార్యదర్శులు ( Panchayat Secretaries) కోరుతున్నారు. గత నాలుగేళ్ల ప్రొబెషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలని అంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అందరు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియప్ పంచాయతీ కార్యదర్శులుగా (Panchayat Secretaries) ప్రమోట్ చేయాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించి ప్రకటించాలని అడిగారు. చనిపోయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretaries) డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రొబెషనరీ గడువు 2023 ఏప్రిల్ 11వ తేదీతో ముగిసింది. రెగ్యులరైజ్ గురించి ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు సమ్ముకు దిగారు. 2019 ఏప్రిల్ 12వ తేదీన విధుల్లో చేరిన జేపీఎస్‌ను మూడేళ్ల ప్రొబెషనరీ తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. మరో ఏడాది ప్రొబెషనరీ కాలాన్ని పెంచింది. నాలుగేళ్లు ముగిసినా.. రెగ్యులరైజ్ చేయడం లేదు. దీంతో పంచాయతీ సెక్రటరీలు సమ్ము బాట పట్టగా.. వారికి ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు వెనక్కి తగ్గడం లేదు. తమ సమస్య పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమని స్పష్టంచేశారు.