AP: రాజధానిలోని AP-SRM విశ్వవిద్యాలయంలో ఈనెల 22 నుంచి మూడురోజులపాటు ‘అమరావతి సాహిత్య ఉత్సవం’ నిర్వహించనున్నారు. వర్సిటీలోని భాషా సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ‘కొత్త నగరం- కొత్త స్వరాలు’ నినాదంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆమ్లాన్ బైశ్యా తెలిపారు. ప్రముఖ కవులు, సాహితీవేత్తలు, విమర్శకులు, విద్యావేత్తలు హాజరు కానున్నారు.