PDPL: సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, భూపతిపూర్ గ్రామాల పరిధిలోని రోడ్డు పక్కనున్న దుకాణాలలో ఆదివారం దొంగతనాలు జరిగాయి. గర్రెపల్లి స్టేజీ వద్ద ఉన్న శ్రీకృష్ణ జెర్సీ పాల దుకాణం, చాయ్ కొట్టు, అలాగే భూపతిపూర్ గ్రామశివారులోని షట్టర్ల పక్కన ఉన్న టేలాలు, చికెన్ సెంటర్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు.