సత్యసాయి: సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ఓంకార్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం సందర్శించారు. పాఠశాలలోని వంటగది, నిల్వ గది, త్రాగునీటి సదుపాయాలను పరిశీలించి నీటి ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని సూచించారు. వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు.