SKLM: జలుమూరు మండలం నగరికటకం గ్రామంలో సుమారు 15 ఏళ్ల క్రితం గ్రంథాలయానికి ప్రభుత్వమే శాశ్వత భవనం నిర్మించింది. అయితే ప్రస్తుతం ఈ భవనం పాఠకులకు నిరుపయోగంగా మారిందని పలువురు స్థానికులు శనివారం తెలిపారు. ఈ గ్రంథాలయ భవనం నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరిందని అన్నారు. ఈ భవనం కు మరమ్మత్తులు చేపట్టి పాఠకులకు వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.