కోనసీమ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాలోని పలు కీలక ప్రాంతాల్లో భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. అమలాపురం, రావులపాలెం, కోటిపల్లి సవరం గ్రామాల్లో పోలీసు బలగాలు ఒకేసారి తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు.