ATP: జిల్లాలో ఉన్న స్మశాన వాటికలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షులు సాకే హరి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నుంచి ప్రారంభించిన స్మశాన సాధన జీపు యాత్రను శనివారం గుత్తిలో ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.