KKD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెలుగు సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళల సాధికారత, బాలికల విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మహిళల భద్రత, హక్కుల గురించి అధికారులు అవగాహనా కల్పించారు.