HYD: ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ యుజిసి వేతనాలను వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.