వానలు బాగా పడితే నదులు, చెరువులు నిండి అలుగుపోస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో చేపలు కొట్టుకుని వస్తాయి. భారీ వర్షాలు పడితే నదుల్లో కాల్వల్లో చెట్లు, మట్టి కొట్టుకువస్తుంది.
Currency Notes : వానలు బాగా పడితే నదులు(River), చెరువులు(Ponds) నిండి అలుగుపోస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో చేపలు కొట్టుకుని వస్తాయి. భారీ వర్షాలు(Heavy Rains) పడితే నదుల్లో కాల్వల్లో చెట్లు(Trees), మట్టి కొట్టుకువస్తుంది. కానీ ఎక్కడైనా కరెన్సీ కట్టలు కొట్టుకు వస్తాయా.. ఏంటి అది అసాధ్యం కదా.. కానీ అది నిజమైంది. బీహార్ రాష్ట్రంలోని ఓ కాల్వలో గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలు కొట్టుకుని వచ్చాయి. ఈ ఘటన బీహార్(Bihar)లోని ససారం జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానిక మీడియా ప్రకారం.. మొరాదాబాద్(Moradabad) లోని ఓ కాల్వలో ఉన్నట్లుండి నోట్ల కట్టలు తేలాయి. కొంతమంది కాలువ దగ్గరికి వెళ్లి చూడగా అవి కనిపించాయి. ఆ నోట్ల కట్టలు చూసి వారు షాక్ తిన్నారు. అన్ని100, 200, 500నోట్ల కట్టలే. ఈ వార్త చుట్టుపక్కల దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంది అక్కడి చేరారు. ఎంత దొరికితే అంత అన్నట్లుగా కాలువ(Canal)లోకి దూకి ఎవరి ఎంత దొరికితే అంతా పట్టుకెళ్లారు. ఆ సమయంలో కొంతమంది.. బ్యాగు(Bag)తో కాల్వలోకి దూకారు. ఇంకా కొంతమంది అయితే..తమ చొక్కాలను విప్పి బ్యాగులుగా చేసుకుని నోట్ల కట్టలను సేకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరలవుతున్నాయి.
అయితే.. అయితే, ఈ నోట్ల కట్టలు నిజమైనవో.. నకిలీవో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. ఇవి నిజమైన నోట్లే అని ఓ మీడియా(Media) కథనంలో పేర్కొంది. సమాచారం లభించడంతో పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడ ఏమీ దొ, అక్కడ ఏమీ కనిపించలేదని, తదుపరి విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
#Bihar:Hugh Amount of Notes found thrown in the canal in Bihar’s #Sasaram.
There was a competition to loot the bundle of cash.