AKP: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షకు 429 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,378 మందికి గాను 3,949 మంది హాజరైనట్లు డీఐఈవో వినోద్ బాబు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిరంతర నిఘా ఉంచామని ఆయన స్పష్టం చేశారు.