పల్నాడు: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శనివారం ఇస్సపాలెంలోని మహంకాళీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు.. కలెక్టర్కు స్వాగతం పలికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.