SKLM: సారవకోట మండలంలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. శనివారం అలుదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈవో మడ్డు వెంకటరమణతో పాటు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ముందస్తుగా వారిని సత్కరించడం జరిగిందని వారు తెలియజేశారు.