Manipur: మణిపుర్ హింసాకాండ..ఘర్షణల్లో 54 మంది మృతి
మణిపుర్(Manipur) హింసాకాండలో మృతుల సంఖ్య 54కు (54 People Died)చేరుకుంది. చురచంద్ పూర్, మోరే, కక్చింగ్, కాంగ్ పోక్సీ జిల్లాల్లో సైన్యం భారీ ఎత్తున చేరి 13000 మందిని రక్షించింది.
మణిపుర్(Manipur) హింసాకాండలో మృతుల సంఖ్య 54కు (54 People Died)చేరుకుంది. ఇది అధికారికంగా ప్రకటించిన నంబర్ మాత్రమే. అనధికారికంగా అయితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఇంఫాల్ లోయలో శనివారం పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. దీంతో దుకాణాలు, మార్కెట్లు తెరుచుకోవడంతో వాహనాలు తిరిగి నడుస్తున్నాయి. అధికారులు సైనిక దళాలు, పోలీసు బలగాల భద్రతను పెంచారు. గత కొన్ని రోజులుగా పోలీసుల బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మణిపుర్ (Manipur)లో ఘర్షణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇరు వర్గాల ఘర్షణల వల్ల ఇప్పటి వరకూ 54 మంది చనిపోయారు(54 People Died). అందులో 16 మృతదేహాలను చురచంద్ పూర్ జిల్లా ఆస్పత్రిలోని మార్చూరీలో ఉంచారు. మరో 15 మృతదేహాలను ఇంఫాల్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం కూడా చురచంద్ పూర్ జిల్లాలో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అందులో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
చురచంద్ పూర్, మోరే, కక్చింగ్, కాంగ్ పోక్సీ జిల్లాల్లో సైన్యం భారీ ఎత్తున చేరి 13000 మందిని రక్షించింది. ఘర్షణల వల్ల వందలాది మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మణిపుర్ (Manipur)లో ప్రస్తుతం 10 వేల మంది సైనికులు ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా(Amith Sha) శుక్రవారం మణిపుర్ సీఎం ఎన్.బిరేన్ సింగ్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర సందర్భంగా చురచంద్ పూర్ జిల్లాలో మొదటగా హింస చెలరేగగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల వల్ల తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.