»Fevikwik Instead Of Atrocious Stitches For Child Treatment Complain To The Aija Police Gadwal District
Treatment: దారుణం కుట్లకు బదులు ఫెవిక్విక్..పోలీసులకు ఫిర్యాదు
పెళ్లి వేడుకలో భాగంగా ఓ బాలుడు(child) ఆడకుంటూ ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో ఈ చిన్నారి ఎడమ కంటి దగ్గర గాయమైంది. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆ బాబు తండ్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ ఏడేళ్ల చిన్నారి ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ పిల్లాడి కంటి దగ్గర గాయమైంది. అది గమనించిన అబ్బాయి తల్లి దండ్రులు అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ఆస్పత్రి వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ క్రమంలో చిన్నారికి గాయామైన చోట కుట్లు వేయకుండా ఫెవిక్విక్(Fevikwik) అంటించి(treatment) పంపించేశారు.
అది గమనించిన బాలుడి తండ్రి(father) ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అతను పోలీసులకు కంప్లైట్ చేశారు. దీంతో ఎస్సై నరేష్ కుమార్ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని గద్వాల్ జిల్లా(gadwal district) అయిజలో చోటుచేసుకుంది.
అయితే కర్ణాటకకు చెందిన వంశీకృష్ణ, సునీత ఫ్యామిలీ వారి బంధువల పెళ్లి వేడుక కోసం అయిజకు వచ్చిన క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఏడేళ్ల బాలుడు ప్రవీణ్ చౌదరి ఆడుకుంటున్న క్రమంలో కిందపడగా..ఎడమ కంటిపైన గాయమైంది.