మహబూబ్ నగర్ 11వ డివిజన్ శ్రీ అభయ వీర హనుమాన్ దేవాలయంలో అన్నదాన షెడ్ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఆదేశాలతో కార్పొరేటర్ జి. లక్ష్మి యాదగిరి గౌడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ షెడ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.