KRNL: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జర్నలిస్టుల ఆక్రిడిటేషన్ రెండో కమిటీ సమావేశం నిర్వహించారు. పలు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొని ఆక్రిడిటేషన్ ప్రక్రియపై తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా కార్డులు జారీ చేయాలని కోరారు. ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.