రెండు దేశాల మధ్య దాదాపు ఏడాదిన్నరగా యుద్ధం జరుగుతోంది. ఐక్య రాజ్య సమితితో అంతర్జాతీయ సంస్థల వేదికలపై ఈ యుద్ధంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా (Russia) చేస్తున్న దమనకాండపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా చేస్తున్న సమరం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ సమావేశంలో రష్యా ప్రతినిధి రెచ్చిపోయారు. దీంతో ఉక్రెయిన్ ఎంపీ అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
టర్కీ (Turkey) రాజధాని అంకారాలో (Ankara) ‘బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ’ (Black Sea Economic Cooperation) 61వ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్ సాండర్ మరికోవ్ స్కీ (Oleksandr Marikovskyi) తమ జెండాను (Flag) ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో రష్యా ప్రతినిధి వచ్చి ఉక్రెయిన్ జెండాను లాక్కొని వెళ్లిపోయారు. ఈ పరిణామంతో అవాక్కైన ఎంపీ మరికోవ్ స్కీ వెంటనే అతడిని అసురించాడు. రష్యా ప్రతినిధిపై దాడి చేసి అతడి చేతిలో నుంచి జెండాను లాక్కున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి భద్రతా సిబ్బంది వీరిద్దరినీ చెరోవైపు తీసుకెళ్లారు. కాగా సమావేశంలోనూ రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడి చేసుకునే పరిస్థితికి చేరింది. ఈ రెండు సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారాయి.
ఉక్రెయిన్ పై రష్యా 14 నెలలుగా యుద్ధం (War) చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం ముగిసేటట్టు కనిపించడం లేదు. రోజురోజుకు రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ పై రెండు డ్రోన్లు దాడికి పాల్పడంతో అంతర్జాతీయంగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. రష్యా అధ్యక్షుడు పుత్లిన్ బంకర్ లోకి వెళ్లారని తెలుస్తోంది. కాగా ఈ దాడి తాము చేసింది కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తెలిపారు.
🥊 In Ankara 🇹🇷, during the events of the Parliamentary Assembly of the Black Sea Economic Community, the representative of Russia 🇷🇺 tore the flag of Ukraine 🇺🇦 from the hands of a 🇺🇦 Member of Parliament.
A scuffle broke out between Ukrainian and Russian delegates at a meeting of the Parliamentary Assembly of the Black Sea Economic Cooperation (PABSEC) in Türkiye’s capital Ankara
Tensions boiled over after Ukrainians interrupted a Russian official’s speech👇 pic.twitter.com/AzZiQi2B6L