కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Election) రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం (Prapaganda) చేస్తుండగా.. వారికి స్వతంత్రులు (Independents) కొంత ఇబ్బందులు కలిగిస్తున్నారు. టికెట్లు రాని నాయకులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతుండడంతో ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల (Promises) వర్షం కురిపిస్తున్నారు. ఓటరును (Voter) దేవుడిగా భావిస్తూ వాళ్లు కోరినన్ని అందిస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకువేసి పెళ్లి కాని బ్రహ్మాచారులకు తాము పెళ్లి చేస్తామని ప్రకటించారు. వధువును వెతికి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఓటేస్తే ఎమ్మెల్యేగా (MLA) గెలిచిన అనంతరం ఆ పని చేస్తామని మేనిఫెస్టోలో (Manifesto) ప్రకటించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటకలోని బెళగావి జిల్లాకు (Belagavi District) చెందిన గురుపుత్ర కెంపణ్న కుల్లూరు (Guruputra Kempanna Kullur), పుండలీక కుల్లూరు (Pundaleeka Kullur) వీరిద్దరూ సోదరులు. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. అరాభవి (Arabhavi) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కెంపణ్న పోటీ చేస్తుండగా.. పుండలీక గోకక్ (Gokak) నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల కోసం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో అవివాహితులైన అబ్బాయిలకు పెళ్లిళ్లు చేస్తామని ప్రకటించారు.
వధువులు దొరకక వివాహం కావడం లేదని బాధపడకండి. మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం పరిధిలోని పెళ్లికాని యువకులు అందరికీ వివాహం జరిపించే హామీ మాది. అవివాహితుల కోసం వివాహ పరిచయ వేదికలు ఏర్పాటుచేస్తాం. వధువును వెతకడంలో సహాయం చేస్తాం’ అని కెంపణ్న, పుండలీక తమ ప్రచార కరపత్రాల్లో ప్రకటించారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా పెళ్లిని కూడా మీ రాజకీయాలకు వాడుకుంటున్నారు కదర్రా అని ఒకరు కామెంట్ చేయగా.. ‘మా జీవితాలతో ఆడుకోవద్దు’ అని మరో పెళ్లి కాని ప్రసాద్ విన్నవించాడు. మరికొందరేమో ‘మా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి హామీలు ఇవ్వాలి’ అని కోరుతున్నారు.