»Maharashtra Politics Oppositions Key Meeting At Pawars House
Maharashtra Politics: పవార్ ఇంట్లో ప్రతిపక్షాల కీలక భేటి
కర్ణాటక(Karnataka)లో బీజేపీ(BJP) ఓడిపోవడంతో మిగిలిన ప్రాంతాల్లోని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అయిన మహారాష్ట్ర(Maharastra)కు కర్ణాటక ఎన్నికలు(Karnataka Elections) మంచి కిక్ ఇచ్చాయి.
కర్ణాటక(Karnataka)లో బీజేపీ(BJP) ఓడిపోవడంతో మిగిలిన ప్రాంతాల్లోని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అయిన మహారాష్ట్ర(Maharastra)కు కర్ణాటక ఎన్నికలు(Karnataka Elections) మంచి కిక్ ఇచ్చాయి. మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు(Elections Results) బూస్ట్ ఇచ్చాయి. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే మహారాష్ట్రలోని విపక్ష కూటమి ఒక్కటైంది.
మహారాష్ట్ర(maharastra)లోని మహా వికాస్ అగాఢీ కూటమి అయిన కాంగ్రెస్(Congress), ఎన్సీపీ(NCP), శివసేన(Sivasena), యూబీటీ నేతలు శరద్ పవార్(Sharad Pawar) నివాసంలో సమావేశం అయ్యారు. మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP)ని కలిసికట్టుగా ఓడించాలనే దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవాద్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆయన వర్గం ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, అజిత్ పవార్, బాలాసాహెబ్ థోరట్ తదితర నేతలు సమావేశంలో పాల్గొని విలువైన విషయాలను చర్చించారు. 2024 లోక్సభ, విధానసభ ఎన్నికల్లో(Elections) సీట్ల కేటాయింపు ఫార్ములా గురించి ప్రధానంగా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ నేతలంతా కీలక విషయాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.