»Karnataka Elections Rahul Gandhi Takes Bus Ride In Bengaluru
Karnataka Elections సిటీ బస్సులో రాహుల్ గాంధీ సందడి
ప్రధాని మోదీ పాలనతో అన్ని ధరలు పెరిగిపోయాయని మహిళలకు చెప్పారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కన్నడ సీమలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) విస్తృతంగా ప్రచారం చేసింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోపాటు (Sonia Gandhi) రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రజల్లోకి దూసుకెళ్లారు. ఈసారి అధికారం ఖాయమని అన్ని సర్వేలు (Surveys) స్పష్టం చేస్తున్నాయి. కాగా ప్రచారంలో రాహుల్ (Rahul Gandhi) చురుగ్గా పాల్గొన్నారు. నిన్న డెలివరీ బాయ్ వాహనం ఎక్కి చక్కర్లు కొట్టగా.. తాజాగా ఆర్టీసీ బస్సు (Bengaluru Metropolitan Transport Corporation -BMTC)) ఎక్కారు. అకస్మాత్తుగా రాహుల్ బస్సులోకి రావడంతో ప్రయాణికులు షాకయ్యారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం బెంగళూరులో (Bangalore) పర్యటించారు. సిటీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలతో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను (Manifesto) ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 40 శాతం కమీషన్ ప్రభుత్వంగా గుర్తింపు పొందిన బీజేపీని ఓడించాలని సూచించారు. ప్రధాని మోదీ (Modi) పాలనతో అన్ని ధరలు పెరిగిపోయాయని మహిళలకు (Women) చెప్పారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న విద్యార్థులతో (Students) కూడా రాహుల్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా రాహుల్ తో మహిళలు (Women) తమ సమస్యలు చెప్పుకున్నారు. ధరలు పెరిగాయని.. ముఖ్యంగా గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పారు. కూరగాయలు, వంట వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని రాహుల్ కు వివరించారు. తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని ప్రకటించారు. అనంతరం ప్రయాణికులు రాహుల్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు.
కాగా మొత్తం 224 స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. సర్వేలన్నీ (Survey) ఇదే విషయం చెబుతున్నాయి. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన అవినీతి బీజేపీని కన్నడ ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ జోష్ తో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విస్తృత ప్రచారం చేసింది. ఈ ఎన్నికల్లో 17 శాతం వరకు ఉన్న లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతు తెలపడం విశేషం.
Shri @RahulGandhi hops on to a BMTC bus & interacts with women passengers to understand their vision for Karnataka.
They candidly discuss topics including the rising price of essentials, Gruhalakshmi scheme and the Congress' guarantee of free travel for women in BMTC and KSRTC… pic.twitter.com/wqXySTY6Qw