»Tirumala Security Failure Devotee Shoots Ananda Nilayam With His Mobile Phone
Tirumalaలో భద్రతా వైఫల్యం.. ఫోన్ తో ఆనంద నిలయం వీడియో తీసిన భక్తుడు
సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రం (Tirumala) తరచూ అపవిత్రమవుతోంది. ఆధ్యాత్మిక నిలయమైన ఈ క్షేత్రంలో తరచూ అపచారాలు జరుగుతున్నాయి. మద్యం, మత్తు పదార్థాలు, నిషేధిత వస్తువులు తరచూ ప్రత్యక్షమవుతున్నాయి. ఇక భద్రతా వైఫల్యం (Security Failure) తరచూ బయటపడుతోంది. తాజాగా మరోసారి నిఘా విభాగం (Surveillance Department) డొల్లతనం కనిపించింది. ఓ భక్తుడు (Devotee) సెల్ ఫోన్ ను ఆనంద నిలయం వరకు తీసుకెళ్లాడు. ఆనంద నిలయాన్ని (Ananda Nilayam) చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సంఘటన సంచలనంగా మారింది.
తిరుమల క్షేత్రాన్ని ఓ భక్తుడు ఆదివారం దర్శించుకున్నాడు. నిఘా వర్గాల కళ్లు గప్పి సెల్ ఫోన్ (Mobile Phone)ను ఆలయంలోకి తీసుకెళ్లాడు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆనంద నిలయం వద్దకు చేరుకున్నాడు. ఆలయ విమాన గోపురాన్ని (Vimana Gopuram) తన సెల్ ఫోన్ తీసి చిత్రీకరించాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు (Shoot). అది వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. టీటీడీ విజిలెన్స్ వైఫల్యం (TTD Vigillence) స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంపై తీవ్ర దుమారం రేపింది. టీటీడీ నిర్వహణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ (YS Jagan) పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు.
కాగా ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం (Tirumala Tirupati Devasthanams- TTD) స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా (Security) పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి. క్యూ లైన్ల (Que Lines) వద్ద భక్తుడిని క్షుణ్నంగా తనిఖీ (Check) చేసి లోపలికి పంపిస్తారు. మరి అక్కడ కూడా సెల్ ఫోన్ ను గుర్తించలేదంటే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం (Negligence) ఎలా ఉందో తెలిసిపోతోంది. క్యూ లైన్ల అనంతరం లోపలికి వచ్చే సమయంలో ఎక్కడా తనిఖీలు ఉండవు. అదే భక్తుడు ఫోన్ ను తీసుకురావడానికి దారి తీసింది. ఈ సంఘటనను టీటీడీ తీవ్రంగా పరిగణిస్తోంది. వెంటనే విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీడియో తీసిన భక్తుడిని గుర్తించే పనిలో టీటీడీ విజిలెన్స్ ఉంది. భక్తుడి ఆచూకీ లభిస్తే ఎక్కడ తప్పిదాలు జరిగాయో తెలిసే అవకాశం ఉంది. తాజా ఘటనతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఇక నుంచి తనిఖీలు ముమ్మరంగా చేయాలని నిర్ణయించింది.