»Telangana 3 Years Old Girl Injured Banjara Hills City Center Mall
City Center Mallలో దారుణం.. మిషీన్ లో పడి తెగిన బాలిక చేతి వేళ్లు
మాల్ లోని స్మాష్ బౌలింగ్ గేమింగ్ ప్లే జోన్ లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారి రోబోటిక్ స్పేస్ షటిల్ మిషీన్ వద్దకు వెళ్లింది. అయితే ఆ మెషీన్ వెనుక భాగం తెరిచి ఉంది. అది కూడా ఆడుకునేదిగా భావించి ఆ యంత్రం లోపల చేయి పెట్టగా చేతివేళ్లు నుజ్జనుజ్జయ్యాయి. గట్టిగా రోదించడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు.
షాపింగ్ మాల్ (Shopping Mall)లో సరదాగా ఆటలాడుకుంటూ మెషీన్ లో చేయి పెట్టడంతో బాలిక చేతివేళ్లు తెగిపోయాయి. ఆ నొప్పి భరించలేక చిన్నారి గిలగిల కొట్టుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చిన్నారి చేతి వేళ్లు పూర్తిగా తొలగించారు. షాపింగ్ మాల్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..
హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ మాల్ (City Center Mall) ఉంది. బంజారాహిల్స్ (Banjara Hills)లోని ఇబ్రహీంనగర్ కు చెందిన సయ్యద్ మక్సూద్ అలీ, తన భార్య మెహతాబ్ జహన్ తో కలిసి తన ముగ్గురు పిల్లలతో పాటు మేనకోడలిని ఆదివారం ఈ మాల్ కు తీసుకువచ్చారు. మాల్ లోని స్మాష్ బౌలింగ్ గేమింగ్ ప్లే జోన్ (Smaaash Bowling Gaming Play Zone)లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో మక్సూద్ కుమార్తె మెహ్విష్ లుబ్న (3) ఆడుకుంటూ రోబోటిక్ స్పేస్ షటిల్ మిషీన్ (Shuttle Machine) వద్దకు వెళ్లింది. అయితే ఆ మెషీన్ వెనుక భాగం తెరిచి ఉంది. అది కూడా ఆడుకునేదిగా భావించి లుబ్న ఆ యంత్రం లోపల చేయి పెట్టింది. దీంతో బాలిక చేతివేళ్లు నుజ్జనుజ్జయ్యాయి. తీవ్రమైన నొప్పితో రోదించడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. బాలిక చేయి చూసి హతాశులయ్యారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లారు. బాలికకు చికిత్స చేసి కుడి చేతి మూడు వేళ్లు తొలగించారు.
కాగా ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు (Parents) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మిషీన్ వెనుక భాగం తెరచి ఉంచారని బంజారాహిల్స్ పోలీసులకు (Banjara Hills Police) ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.