»West Bengal Mamata Banerjees Workout Routine Includes A Treadmill And A Pet
Workout with Pet కుక్కపిల్లతో సీఎం మమతా బెనర్జీ వాకింగ్.. వీడియో వైరల్
ట్రెడ్ మిల్ పై నడుస్తూ వ్యాయామం చేశారు. సాధారణంగా ట్రెడ్ మిల్ పాటలు వింటూ చేస్తారు. కానీ మమతా బెనర్జీ ప్రత్యేకత చాటారు. తన ప్రత్యేక జాతికి చెందిన కుక్కను పట్టుకుని ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేశారు.
నిత్యం ప్రభుత్వ వ్యవహారాలు, రాజకీయాలతో (Politics) బిజీగా ఉండే పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ (Mamata Banerjee) కొంత సేదతీరారు. ఆదివారం పూట ఇంట్లో కసరత్తులు చేస్తూ తన పెంపుడు కుక్కతో (Pet) సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను మమత తన ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో పంచుకున్నారు. ఆ వీడియో వైరల్ గా మారింది.
కలకత్తాలోని (Calcutta) తన నివాసంలో సీఎం మమతా ఉదయం పూట కసరత్తులు (Excercise) చేశారు. ట్రెడ్ మిల్ (Treadmill)పై నడుస్తూ వ్యాయామం చేశారు. సాధారణంగా ట్రెడ్ మిల్ పాటలు వింటూ చేస్తారు. కానీ మమతా బెనర్జీ ప్రత్యేకత చాటారు. తన ప్రత్యేక జాతికి చెందిన కుక్కను పట్టుకుని ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేశారు. కుక్కను తదేకంగా చూస్తూ నడిచారు. ఈ వీడియోను ఇన్ స్టాలో మమత పోస్ట్ చేశారు. ‘కొన్ని రోజులు మీకు అదనపు ప్రేరణ కావాలి’ అంటూ రాసి ఆ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది.