MNCL: ఈ నెల 18న బీసీ జెఎసి ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బంద్ విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు.