MLG: జిల్లా వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కుండపోత వాన కురిసింది. మేడారం జాతర అభివృద్ధి పనుల పరిశీలనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్లో చేరుకోవాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా వారి పర్యటన పై సందిగ్ధత నెలకొంది.