అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మూడో షెడ్యూల్ తాజాగా పూర్తి కావడంతో 60% చిత్రీకరణ పూర్తయింది. మోహన్ బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.