KRNL: అచ్యుతాపురం సెజ్‌కు 5 వేల ఎకరాలు సేకరించారని శుక్రవారం మంత్రి టీజీ. భరత్ వెల్లడించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ప్రకారం పరిహారం అడుగుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంలో సంప్రదింపులు చేయాలని కోరారు. కాకినాడ సెజ్ కోసం 4 వేల ఎకరాలు తీసుకున్నారని, అక్కడ కూడా కొందరు రైతులకు పరిహారం అందలేదన్నారు. సమస్యను పరిష్కరిస్తామన్నారు.