»Terrible Road Accident In Jharkhand 11 Died 29 Injured In Gumla District
Jharkhandలో ఘోర ప్రమాదం.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐదుగురు దుర్మరణం
వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి 34 మందితో ఓ బస్సు పెళ్లి కోసం మంగళవారం బయల్దేరింది. పెళ్లి అనంతరం భోజనం చేసి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాత్రి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
వివాహానికి (Marriage) హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న బస్సు (Bus) అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ శిశువు కూడా ఉంది. పెళ్లితో ఆనందంగా ఉండాల్సిన వారి ఇల్లు విషాదంలో మునిగింది. ఈ సంఘటన జార్ఖండ్ (Jharkhand)లో చోటుచేసుకుంది.
గుమ్లా జిల్లా (Gumla District) దుమ్రిలోని సరాన్ దిహ్ లో జరిగిన వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు (Family Members) అందరూ కలిసి 34 మందితో ఓ బస్సు పెళ్లి కోసం మంగళవారం బయల్దేరింది. పెళ్లి అనంతరం భోజనం చేసి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాత్రి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుందర్ గయార్ (50), లుందారి దేబి (45), సబితా దేబి (50), పులికర్ కిండో (50), అల్సు నగేసియా (45) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగతా బంధువులు 29 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని చైన్ పుర్ (Chainpur) లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స (First Aid) అనంతరం వేరే ఆస్పత్రికి పంపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయపడిన వారిలో 15 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో 9 నెలల శిశువు కూడా ఉంది.