NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వన్య ప్రాణుల రక్షణకు అటవీశాఖ డ్రోన్లను రంగంలోకి దించింది. వేటగాళ్ల కదలికలు, అడవి ఆక్రమణలు, కార్చిచ్చును పసిగట్టేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇవి 4 కి.మీ. దూరం వరకు నిఘా ఉంచుతాయని రేంజ్ ఆఫీసర్ వీరేశ్ తెలిపారు. అడవి జంతువులకు ఇక మరింత భద్రత లభించనుంది.