ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్తాన్(TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆప్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అయితే ఈ దాడులపై పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.