TG: సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో పయనమయ్యారు. సీఎం వెంట టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దశదినకర్మలో సీఎం పాల్గొననున్నారు. బోరేగాంలో నిర్వహించే కార్యక్రమంలో నివాళులర్పించనున్నారు.