తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ఊట్కూరు పెద్దవాగు పరివాహక ప్రాంతం ఇసుక అక్రమ తరలింపునకు కేంద్రంగా మారింది. అర్ధరాత్రి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు సరిహద్దు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుకను కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో డంప్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అధికారులు అక్కడికి వచ్చి స్వాధీనం చేసుకునే వీలుండదని అక్రమార్కులు భావిస్తున్నారట.