ATP: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు పంక్చువాలిటీ అవార్డు లభించింది. రైళ్లను సకాలంలో నడిపే విషయంలో రైల్వే శాఖ డివిజన్లకు విశిష్ట రైల్ పురస్కార్ అవార్డుల్లో భాగంగా గ్రేడింగ్ ఇస్తోంది. అందులో గుంతకల్లు డివిజన్‌కు 100 శాతం పంక్చువాలిటీ అవార్డు లభించింది. గుంతకల్లు డివిజన్‌కు ఈ అవార్డు లభించడం ఇది 11వసారి కావడం గమనార్హం.