టీమిండియా అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్టార్ బౌలర్ షమీ స్పందించాడు. తనపై సోషల్ మీడియాలో రూమర్లు, మీమ్స్ చాలా వచ్చినట్లు తెలిపాడు. జట్టుకు ఎంపిక చేయడమనేది తన చేతుల్లో ఉండదని.. అది సెలక్షన్ కమిటీ బాధ్యతని చెప్పాడు. కోచ్, కెప్టెన్‌కు తన అవసరం ఉందనిపించాలని, వారే తనను ఎంపిక చేయాలని పేర్కొన్నాడు.