NRML: జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా జాదవ్ సుభాష్ శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసిన సలిరాం నాయక్‌ను బదిలీ చేసి అదిలాబాదులో పనిచేస్తున్న జాదవ్ సుభాష్ పదోన్నతి ద్వారా ఇక్కడికి బదిలీ చేయడంతో ఈయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అధికారికి పట్టణ ఏడిఈకె శ్రీనివాసరావు విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.