బ్రాండెడ్ ఔషధాలపై అక్టోబర్ 1న సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనరిక్ మందులపై సుంకాలు విధించే అవకాశం లేదని శ్వేతసౌధం వర్గాలు స్పష్టం చేశాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించాయి. సెక్షన్ 232 కింద జనరిక్ మందులపై సుంకాల అంశం చర్చకు ట్రంప్ కార్యవర్గం సుముఖంగా లేదని శ్వేతసౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ అన్నారు.