ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అంటే.. బహుశా తెలియని వారుండరేమో. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ (Oscar) కొట్టేసి.. హిస్టరి క్రియేట్ చేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన రాజమౌళి.. అంతకు మించి అనేలా అవార్డ్స్ అందించాడు. దీంతో ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. ఇక్కడి నుంచి ఎలాంటి సినిమా రిలీజ్ అయినా.. గ్లోబల్ రేంజ్లో సౌండ్ వస్తోంది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా చేయబోతున్నాడు రాజమౌళి.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) భారీ ప్రాజెక్ట్ కమిట్ అయిపోయాడు జక్కన్న. హాలీవుడ్ రేంజ్లో రాబోతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ.. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని వినిపిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ జక్కన్న మైండ్‌లో మాత్రం ఓ భారీ ప్రాజెక్ట్ అలాగే ఉండిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు జక్కన్న. అయితే దీన్ని బయటికి తీసింది మాత్రం వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). సింధు లోయ నాగరికతకు (Indus Valley Civilization) సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ‘ఇలాంటివి మన చరిత్రకు జీవం పోస్తాయి.. మన ప్రతిభను ప్రతిబింబిస్తాయి. నాటి పరిస్థితులు ప్రపంచానికి తెలిసేలా ఒక సినిమా తీయగలరా? అని రాజమౌళిని ట్యాగ్ చేశారు ఆనంద్ మహింద్రా. దీనికి వెంటనే జక్కన్న స్పందించాడు.
‘మగధీర (Magadheera) సినిమాను ధోలావిరాలో (Dholavira) షూట్ చేసినప్పుడు.. అక్కడ శిలజంగా మారిన ఓ చెట్టును చూశాను. అప్పుడే సింధు లోయ నాగరికతపై సినిమా తీస్తే, అది చెట్టు చెబుతున్నట్టు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చిందన్నారు. అందుకోసం పాకిస్తాన్‌కి (Pakistan) కూడా వెళ్ళాను. మొహెంజో దారో (Mohenjo Daro) వెళ్లి, అక్కడ రీసెర్చ్ చేయాలని ట్రై చేశా.. కానీ పర్మిషన్ రాలేదంటూ’ రిప్లే ఇచ్చాడు. దీంతో రాజమౌళి మైండ్‌లో ఈ భారీ ప్రాజెక్ట్ కూడా ఉందనే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మగధీర టైంలో ఉన్న రాజమౌళి క్రేజ్ వేరు.. ఇప్పుడు వేరు. జక్కన్న తలుచుకుంటే.. ఇప్పుడు ఎలాంటి సినిమా అయిన తీయగలడు. ఎక్కడికైనా వెళ్లగలడు. కాబట్టి ఖచ్చితంగా రాజమౌళి నుంచి భవిష్యత్తులో సింధు నాగరికతపై సినిమా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అయితే అది ఎప్పుడు? అనేది ఇప్పుడే చెప్పలేం.
Yes sir… While shooting for Magadheera in Dholavira, I saw a tree so ancient that It turned into a fossil. Thought of a film on the rise and fall of Indus valley civilization, narrated by that tree!!
Visited Pakistan few years later. Tried so hard to visit Mohenjodaro. Sadly,… https://t.co/j0PFLMSjEi