పవిత్రమైన వృత్తి. ప్రజలకు బాధ్యత కల్పించాల్సిన ఉద్యోగులు (Employees). నిరంతరం ప్రజల భద్రతపై దృష్టి సారించాలి. అలాంటి వారు మద్యానికి (Liquor) బానిసలయ్యారు. ఒక్కోసారి విధుల సమయంలోనూ మద్యపానం (Drinking) సేవిస్తున్నారు. వీరిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మద్యానికి బానిసై దేహాదారుఢ్యం కోల్పోయి విధులకు అన్ ఫిట్ (Unfit) కోల్పోయారు. అలాంటి 300 మంది పోలీస్ అధికారులు, ఉద్యోగులను ప్రభుత్వం సాగనంపింది. స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Retirement Scheme -VRS) చేయాలని ఆదేశాలు ఇచ్చింది. త్వరలోనే వారంతా మాజీ పోలీసులు కానున్నారు.
విపరీతమైన మద్యపానం (Drinking Habit) అలవాటుగా మారి దేహాదారుఢ్యం కోల్పోయిన 300 మందికి పైగా పోలీస్ అధికారులు (Police Officers), కానిస్టేబుళ్లను (Constable) వీఆర్ఎస్ కు అవకాశం కల్పిస్తున్నట్లు అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ప్రకటించారు. ‘ఇది పాత నిబంధన. కానీ ఇంత వరకు ప్రభుత్వం అమలు చేయలేదు. వీఆర్ఎస్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఖాళీల భర్తీకి నియామకాలు కూడా వెంటనే చేపడుతాం’ అని ఆదివారం సీఎం తెలిపారు. కాగా, ముఖ్యమంత్రితో పాటు హోం శాఖ బాధ్యతలు కూడా బిశ్వ శర్మ నిర్వహిస్తున్నారు.