»Jagan Vs Rajini Fans Rajinikanths Fans Demand Apology From Ysrcp Leaders
Rajinikanthకు సీఎం జగన్, వైఎస్సార్ సీపీ క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్విటర్ లో ట్రెండింగ్
రజనీకాంత్ వ్యక్తిత్వం దెబ్బతీస్తూ విమర్శలు చేయడంపై అభిమానులు భగ్గుమన్నారు. రజనీ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయినా ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దిగ్గజ నటుడు.. సంకుచిత భావాలు లేని వ్యక్తి.. తమిళనాడు (Tamil Nadu) ప్రజల ఆరాధ్య దైవం.. తెలుగు ప్రజలతో అవినాభావ సంబంధం.. అలాంటి నటుడిపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ (YSRCP) ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. అతి జుగుప్సకరంగా.. దారుణంగా.. విలువలు మరచి తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు మరింత రెచ్చిపోయి ఆ నటుడిని వ్యక్తిగతంగా కించపర్చారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో (Cine Industry) ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. తమ అభిమాన నటుడిని దూషించడంపై అభిమానులు, అనుచరులు ఏపీ సీం జగన్ (YS Jagan) పాలకులపై మండిపడ్డారు. ఆది, సోమవారాల్లో ఇదే అంశంపై ట్విటర్ (Twitter)లో ట్రెండయ్యింది. వైఎస్సార్ సీపీ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ మార్మోగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడలో (Vijayawada) శుక్రవారం మాజీ సీఎం, తెలుగు తేజం ఎన్టీఆర్ (NT Rama Rao) శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), బాలకృష్ణ (Balakrishna)తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తనకు చంద్రబాబుతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని పంచుకున్నారు అంతే. చంద్రబాబును ప్రశంసిస్తూ ప్రసంగం చేశారు. దీన్ని ఏపీ మంత్రులు రోజా (Roja), అంబటి రాంబాబు (Ambati Rambabu), వెల్లంపల్లి, జోగి రమేశ్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, లక్ష్మీ పార్వతి, ఎంపీ నందిగామ సురేశ్ తప్పుబట్టారు. చంద్రబాబును ప్రశంసించడంపై వారికి ఏమైందో తెలియదు కానీ ఇక ఆదివారం విమర్శలు చేశారు. ఇక్కడ మొదలైంది వివాదం. రజనీకాంత్ వ్యక్తిత్వం దెబ్బతీస్తూ విమర్శలు చేయడంపై అభిమానులు భగ్గుమన్నారు. రజనీ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయినా ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి గౌరవం లేకుండా.. రా.. ఎధవ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మండిపడ్డారు.
రజనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలపై అభిమానులు (Fans) గుర్రుమన్నారు. వైఎస్సార్ సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు రజనీకాంత్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు మొదలయ్యాయి. క్రమంగా ఈ డిమాండ్ సోషల్ మీడియాలో (Social Media) ట్రెండింగ్ లోకి వచ్చింది. వైసీపీకి వ్యతిరేకంగా మీమ్స్, ట్రోలింగ్ మొదలైంది. వైఎస్సార్ సీపీపై తమిళనాడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నాయకుల తీరుపై మండిపడుతున్నారు. అతిథిలాగా మీ రాష్ట్రానికి వస్తే ఇదేనా చేసే మర్యాద? అని నిలదీస్తున్నారు. తన స్నేహితుడిని అభిమానిస్తే మీకేంటి నష్టం? అని ప్రశ్నిస్తున్నారు. రజనీ ఎవరినీ కించపరచలేదు.. ఆయనది అలాంటి వ్యక్తిత్వం కాదు అని కామెంట్లు చేస్తున్నారు. #YSRCPApologizeRajini, #YsJaganShouldApologizeToRajinikanth అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో ఆది, సోమవారాల్లో ట్రెండింగ్ లో ఉంది. ‘జైలర్.. ఖైదీ’ (Jailer Prisoner) అంటూ రజనీ సినిమాను ఉద్దేశించి ఫొటోలు పంచుకున్నారు. అంటే రజనీ జైలర్ గా ఉంటే అందులో ఖైదీ జగన్ అనే అర్థం వచ్చేలా పోస్టులు చేశారు.