Objectionable content aired midnight at Telugu News Channel
Objectionable content:ఎలక్ట్రానికి మీడియా (electronic media) ప్రజలకు సమాచారం వేగంగా అందిస్తోంది. అర్ధరాత్రి అయినా సరే టీవీలు (TV) చూస్తుంటారు. ఏ అప్ డేట్ కోసం అయినా.. ట్రావెల్ కోసం అయినా సరే చానెల్స్ వాచ్ చేస్తుంటారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో చానెల్స్ (Channel) ఎక్కువే. గత నెల 28వ తేదీన ఓ ప్రముఖ న్యూస్ చానెల్స్‌లో అడల్ట్ కంటెంట్ ప్లే అయ్యిందని తెలిసింది.
ఏం జరిగిందో చానెల్ యాజమాన్యం తెలుసుకోలేకపోయింది. 15 నిమిషాల పాటు (15 minutes) ఆ కంటెంట్ ప్లే అయ్యిందని.. తర్వాత ఆ ఫీడ్ (feed) తొలగించామని చెబుతోంది. తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో (police station) కంప్లైంట్ చేసింది. ఆ చానెల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో (mla colony) ఉంది.
ఎలక్ట్రానిక్ మీడియాలో (electronic media) చాలా పోటీ ఉందని.. రేటింగ్ (rating) కోసం కష్టపడుతున్నామని చెబుతోంది. ఇలా అడల్ట్ కంటెంట్ ప్లే కావడంతో తమ చానెల్ పేరు దెబ్బతింటుందని పేర్కొంది. హ్యాక్ చేసి.. అడల్ట్ కంటెంట్ ప్లే చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.