BHPL: చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన యువ పాటల రచయిత మ్యాదరి సునీల్‌ను తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవమైన ‘నంది అవార్డు’ వరించింది. ఇవాళ హైదరాబాద్‌లో మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విశేష వేడుకలో ప్రముఖ నటుడు, కమెడియన్ బాబూమోహన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సునీల్‌ను జిల్లా ప్రజలు అభినందించారు.