»Warning To People Of Telangana Heavy Rain With Thunder
Rain Alert : తెలంగాణ ప్రజలకు హెచ్చరిక..ఉరుములతో కూడిన భారీ వర్షం!
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని, మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ(Telangana) ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad Weather Department) హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో వడగళ్ల వాన దంచి కొట్టనున్నట్లు తెలిపింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకూ ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం(Weather centre) తెలిపింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని, మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు(Formers) వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే హైదరాబాద్(Hyderabad) మొత్తం దట్టంగా మేఘాలు అలముకుని ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరించింది.
ఇప్పటికే తెలంగాణ(Telangana)లో అకాల వర్షాలు(Rain), వడగండ్ల వానలు పంటలను నాశనం చేశాయి. వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షం(Heavy Rain) కారణంగా ఇప్పటికే పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయిందని, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలుల వల్ల చేతికొచ్చే పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రజలు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ(Weather Department) అధికారులు సూచించారు.