Skating : భారతీయ సంప్రదాయానికి ప్రతీక చీర.. మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫ్యాషన్లు వచ్చి చీర ప్రత్యేకతే వేరు. అందుకే ప్రపంచమంత భారతీయ చీరకట్టుకు ముగ్ధులైపోతుంటారు. పండుగలు వచ్చాయంటే చాలు.. గృహిణులు, యువతులు ప్రత్యేక చీరకట్టులో అందంగా కనిపిస్తుంటారు. క్రీడల్లో పాల్గొన్నప్పుడు, బైకింగ్ లేదా సాహస క్రీడల కోసం మాత్రమే పాశ్చాత్య దుస్తులు ధరించడం నియమంగా మారింది. అయితే ఈ నిబంధనను ఓ భారతీయ మహిళ ఉల్లంఘించింది. చీరలో ఐస్ స్కేటింగ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో దివ్య మైయా అనే మహిళ ఆరుగజాల చీర కట్టుకుంది. మంచులో తనకు ఎంతో ఇష్టమైన స్కేటింగ్ చేస్తోంది. ఈ సాహస వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్ యూజర్లు దివ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోగ్రాఫర్‌ని కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని, అతను ఒక్క ఫ్రేమ్‌ను కూడా మిస్ చేయలేదని ఒకరు వ్యాఖ్యానించారు.