»Dismissal Of 140 People In Telangana University Concern People To Return Money From Vc Nizamabad
Telangana University:లో 140 మంది తొలగింపు..వీసీ డబ్బులు ఇవ్వాలని ఆందోళన
తెలంగాణ యూనివర్సిటీ(Telangana University)లో అక్రమాలు జరిగాయాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ వద్ద వీసీ(VC) డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని...ఇప్పడు తమను తొలగిస్తే ఎలా బతకాలని మండి పడుతున్నారు.
నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీ(Telangana University)లో వీసీపై ఏసీబీ విచారణ కాస్తా..ఉద్యోగుల తొలగింపు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇదే యూనివర్సిటీలో పనిచేస్తున్న 140 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. వీరంతా ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చినట్లు తేలింది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారిలో జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు ఉన్నారు. ఈ క్రమంలో తామ వద్ద వీసీ(VC) డబ్బులు తీసుకుని జాబ్స్ ఇచ్చాడని..తన నగదు తమకు తిరిగి ఇవ్వాలని ఈ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది(outsourcing employees) వద్ద కూడా డబ్బులు(money) తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో యూనివర్సిటీలు, ఆస్పత్రులు, రెవిన్యూ కార్యాలయాలు సహా అనేక డిపార్టుమెంట్లలో పర్మినెంట్ సిబ్బందికి బదులు ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తూ కాలం వెల్లదిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక చోట్ల నగదు తీసుకుని జాబ్స్ ఇచ్చారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఈ నెల 19వ తేదీన హైదరాబాద్(hyderabad) రూసా భవనంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో వర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏం జరిగిందో తెలియదు కానీ వీసీ రవీందర్ వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. తర్వాత వీసీ అక్రమాలపై విచారణ కోసం ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, నలుగురు ఈసీ మెంబర్లతో కలిపి పాలకమండలి కమిటీని ఏర్పాటు చేసింది.
వర్సిటీ వీసీ రవీందర్(nizamabad vc ravinder) అక్రమ చెల్లింపులు, నిధుల దుర్వినియోగంపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారించింది. సభ్యులు గంగాధర్ గౌడ్, వసుంధర దేవి, ప్రవీణ్ కుమార్ వర్సిటీని సందర్శించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని కలిసి 2021 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ 18 వరకు వర్సిటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆ మధ్యలో జరిగిన చెల్లింపులపై విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.